| title | React డెవలపర్ టూల్స్ |
|---|
React కాంపోనెంట్‌లను తనిఖీ చేయడానికి, props మరియు state ని ఎడిట్ చేయడానికి మరియు పెర్ఫార్మన్స్ సమస్యలను గుర్తించడానికి React డెవలపర్ టూల్స్ ను ఉపయోగించండి.
- React డెవలపర్ టూల్స్ ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి
React తో నిర్మించిన వెబ్‌సైట్‌లను డీబగ్ చేయడానికి సులభమైన మార్గం React డెవలపర్ టూల్స్ బ్రౌజర్ ఎక్సటెన్షన్ ను ఇన్‌స్టాల్ చేయడం. ఇది అనేక ప్రసిద్ధ బ్రౌజర్‌లకు అందుబాటులో ఉంది:
ఇప్పుడు, మీరు React తో నిర్మించిన వెబ్‌సైట్ ను సందర్శిస్తే, మీరు Components మరియు Profiler ప్యానెల్‌లను చూస్తారు.
ఇతర బ్రౌజర్‌ల కోసం (ఉదాహరణకు, Safari), react-devtools npm ప్యాకేజీని ఇన్‌స్టాల్ చేయండి:
# Yarn
yarn global add react-devtools
# Npm
npm install -g react-devtoolsతరువాత టెర్మినల్ నుండి డెవలపర్ టూల్స్ ను ఓపెన్ చేయండి:
react-devtoolsఆపై మీ వెబ్‌సైట్ యొక్క <head> ప్రారంభంలో క్రింది <script> ట్యాగ్‌ని జోడించడం ద్వారా మీ వెబ్‌సైట్‌ను కనెక్ట్ చేయండి:
<html>
<head>
<script src="http://localhost:8097"></script>ఇప్పుడు మీ బ్రౌజర్‌లో వెబ్‌సైట్‌ను రీలోడ్ చేయండి, తద్వారా మీరు దీన్ని డెవలపర్ టూల్స్ లో వీక్షించవచ్చు.
React Native తో రూపొందించబడిన యాప్‌లను తనిఖీ చేయడానికి కూడా React డెవలపర్ టూల్స్ ను ఉపయోగించవచ్చు.
React డెవలపర్ టూల్స్ ను ఉపయోగించడానికి సులభమైన మార్గం దీన్ని గ్లోబల్గా ఇన్‌స్టాల్ చేయడం:
# Yarn
yarn global add react-devtools
# Npm
npm install -g react-devtoolsతరువాత టెర్మినల్ నుండి డెవలపర్ టూల్స్ ను ఓపెన్ చేయండి.
react-devtoolsదీన్ని రన్నింగ్లో ఉన్న ఏదైనా లోకల్ React Native యాప్‌కి కనెక్ట్ చేయాలి.
డెవలపర్ టూల్స్ కొన్ని సెకన్ల తర్వాత కనెక్ట్ కాకపోతే యాప్‌ని రీలోడ్ చేయడానికి ప్రయత్నించండి.

